ప్రస్తుతం ఒక ఘనత వహించిన ముఖ్యమంత్రే మందుకొట్టి అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా, మీడియా సమావేశాల్లో మందు మత్తులో అవాకులు చవాకులు పేలినా ప్రశ్నించే నాధుడే లేకుండా పోయాడు. ఈ విషయంలో ఏ పత్రిక కాని, ఛానల్ కాని ఎందుకు ప్రశ్నించటం లేదు. ఈ ముఖ్యమంత్రి అన్ని విషయాలకు, చట్టాలకు అతీతుడా? అసెంబ్లీ సమావేశాలకు, మీడియా సమావేశాలకు, హాజరయ్యే ప్రతి ప్రజా ప్రతినిధిని, మంత్రి, ముఖ్యమంత్రితో సహా బ్రీథ్ అనలైజార్ ద్వారా పరీక్షించండి, ఎంతమంది దొంగలు దొరికిపోతారో! వ్యక్తిగతంగా మనకు ఎన్ని బలహీనతలైనా ఉండవచ్చు కాని ప్రజాజీవితంలో ఉండేవారు, ప్రజల ముందుకు, మీడియా ముందుకు వచ్చినపుడు ఎంతో సంస్కారవంతంగా ప్రవర్తించాలి. గతంలో దగుల్బాజీ వేషాలేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణదత్ తివారి ABN ఆంధ్రజ్యోతి చొరవతో పరువుతో పాటుగా, పదవి కూడా కోల్పోయాడనే విషయం మనందరికీ తెలిసిందే! ఇలాంటి స్ట్రింగ్ ఆపరేషన్ చేయటానికి మరోసారి మీడియా ధైర్యం చెయాలి. .
మందు కొట్టందే సరిగా నిలబడి మాట్లాడలేని ఈ ముఖ్యమంత్రి తన అలవాట్లు, ప్రవర్తన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని సందేశం ఇస్తాడు, ఏరకంగా మార్గదర్శకుడు అవుతాడు?