ఈ జాబితాలో ఉన్నవారందరూ ఆగ్ర కులాలవారే! స్వచ్ఛ భారతానికై ప్రతిరోజూ తమ విధులు నిర్వహిస్తున్న నిమ్న జాతుల వారికి, బడుగు బలహీన వర్గాలవారికి ఈ జాబితాలో స్థానం ఎక్కడ? ఎన్నో ఏళ్ళ తరబడి గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య విభాగంలో పనిచేసేవారు కాని, డ్రైనేజీలు శుభ్రంచేసి ప్రజారోగ్యం కాపాడేవారు కాని ఈ కార్యక్రమానికి "అంబాసిడర్లు" (ప్రచార కర్తలుగా) నియమించి ఉంటే బాగుండేది. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రజారోగ్యం కాపాడుతున్న ప్రజారోగ్య శాఖ సిబ్బంది ఈ ప్రభుత్వం కంటికి కనిపించటం లేదా?
తెలుగు రాష్ట్రాల్లో స్వచ్చ భారత్ ప్రచారం చేయటానికి ఇంతమంది చెత్త బ్యాచ్ అవసరమా? వీళ్ళందరికీ పెద్ద పెద్ద భవంతులు.. వాటిని శుభ్రం చేయటానికి కనీసం నలుగురైదుగురు తక్కువ కాకుండా పనివాళ్ళు ఉన్నారు. వారి, వారి వ్యాపకాల్లో తీరిక లేకుండా గడిపే వీరు ప్రచారం కోసం ఫోటోలకు ఫోజులివ్వటం తప్ప ఏనాడైనా వాళ్ళ ఇల్లో, ఆఫీసో స్వయంగా శుభ్రం చేసుకున్నారా? స్వచ్చ భారత్ కార్యక్రమం ప్రచారం చేయటంలో వీరి పాత్ర ఏమిటో, ఏ రకంగా ప్రచారం చేస్తారో ఆ కార్యక్రమం గురించి ప్రజల్లో ఏ రకంగా అవగాహన కలిగిస్తారో అర్ధం కావటం లేదు! ప్రస్తుతం వీళ్ళేమి చేస్తున్నారు! వీళ్ళ అడ్రెస్ ఎక్కడ?
ప్రచార ఆర్భాటంలో పేరొందిన మోడీ, బిజెపి ఏదో ఒక జనాకర్షణ కార్యక్రమం పెట్టి, ప్రచార సాధనాల్లో గొప్పగా ఊదర గొడుతున్నారే తప్ప, నిజంగా వాటి వలన ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం జరగటం లేదు. వీళ్ళు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల జోలికి పోకుండా... ఆడంబరాలు, ఆర్భాటాలు, అతిశయోక్తులు, అసత్య వాగ్దానాలతో ప్రజలను మభ్య పెడుతూ.. అరచేతిలో స్వర్గం చూపిస్తూ కాలం గడిపేస్తున్నారు...