అసెంబ్లీ నుండి సస్పెండ్ అయిన రోజు రోజా కాని, ఆ పార్టీ సభ్యులు ఎవ్వరు కాని పెద్ద ప్రతిఘటించ లేదు, ఆ రోజు ఆ విషయాన్ని పెద్ద సీరియస్ గా కూడా తీసుకోలేదు. రోజా కూడా తనపై బహిష్కరణ వేటు ఉపసంహరించుకోమని కానీ, జరిగిన దానికి పశ్చాత్తాపం ప్రకటించటం కానీ జరగలేదు. ప్రస్తుతం రోజా నెలవారీ పోషణ ఈటవి 'జబర్దస్త్' కార్యక్రమం పై వచ్చే పారితోషికం పైనే నడుస్తుందట, అసెంబ్లీ నుండి బహిష్కరణకు గురవటం తనకు బాగా కలిసి వచ్చిందని, జబర్దస్త్ షూటింగ్ షూటింగ్ కు ఇబ్బంది లేదని రోజా తన సన్నిహితుల వద్ద తెగ ఆనంద పడిపోతుందట. రోజా అసెంబ్లీలో లేకపోవటం తనకు పోటి లేకుండా పోయిందని జగన్ కూడా మహదానందంగా ఉన్నాడట.
విషయం ఇలా ఉంటె.. ఈరోజు జగన్ పుట్టిన రోజు కావటం వలన జగన్ ముందుగానే తన కుటుంబంతో, సన్నిహితులతో కొన్ని పుట్టినరోజు వేడుకల కార్యక్రమాలు ఫిక్స్ చెసుకున్నాడట. జగన్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటానికి అతనితో సహా వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొడితే చెడ్డ పేరు వస్తుందని భావించి అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టటానికి ఒక బ్రహ్మాండమైన పధకం వేశారట.
శిఖండిని అడ్డం పెట్టుకున్న అర్జునుడి లాగా జగన్ 'రోజా' ను అడ్డం పెట్టుకుని బ్రహ్మాండమైన నాటకాన్ని ప్రదర్శించి రక్తి కట్టించాడు. రోజాపై బహిష్కరణ వేటు ఉపసంహరించుకోవటం కుదరదని తెలిసి కూడా.. రోజాపై బహిష్కరణ వేటు ఉపసంహరించకపోతే తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని చెప్పి అసెంబ్లీ నుండి బయటకు వెళ్ళిపోయి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
వైకాపా ఎమ్మెల్యే లను ప్రజలు ఎన్నుకుంది తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించటానికా లేక తమ స్వంత అజెండా తో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి తమ నేత పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటానికా అనే ప్రశ్నకు సమాధానం తమ నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవాలి. చిల్లర వెధవలను, కేడి గాళ్ళను అసెంబ్లీకి పంపిస్తే ఇలాగే ఉంటుంది అని నియోజకవర్గ ప్రజలు వీళ్ళను ఛీ కొడ్తున్నారు.