మనం పుట్టిన తేది, నెల, సంవత్సరం కూడా మనం ఇంగ్లీష్ కాలమానం ప్రకారమే నిర్ణయిస్తాం తప్ప తెలుగు కాలమానం ప్రకారం కాదని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
కంపూటర్లు, మొబైల్ ఫోన్లు, టివి మొదలైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మనల్ని ఆధునిక జీవితానికి అలవాటు పడేలా చేశాయి, అవి లేనిదే మనకు రోజు గడవదు. ఇంగ్లీషు వాడు మనల్ని కొన్ని అలవాట్లకు బానిసలని చేసినా, ఇంగ్లీషు విద్య నేర్చుకోవటం వలనే మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు, ఉపాధి పొందగలుగుతున్నాం.. అవునన్నా.. కాదన్నా ఇది అక్షర సత్యం.
కొంతమంది ఇంగ్లీషు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని, ఆ వేడుకలు జరుపుకోగూడదని చేసే వాదనతో నేను విభేదిస్తాను. ఇంగ్లీషు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం తప్పు కాదు కానీ.. రాత్రంతా వేలకు వేలు ఖర్చు చేసి మందు కొట్టి పార్టీలు చేసుకోవటం, ఆడంబరంగా బహుమతులు పంచటం వంటి విషయాల్లో మాత్రం నేను ఏకీభవించను. మన దేశంలో అన్ని మతాల వారి పండుగలు జరుపు కుంటాము అలాగే ఇది ఒక సందర్భంగా భావించి వేడుక జరుపుకోవటంలో తప్పులేదనేది నా భావన.
2015 సంవత్సరంలో చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, తీపి జ్ఞాపకాలను తలచుకుంటూ.. కోటి ఆశలతో నూతన సంవత్సరం 2016 కు స్వాగతం పలుకుదాం. ఈ 2016 సంవత్సరంలో విశ్వ వ్యాప్త మానవాళి శాంతి సౌఖ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.....