వచ్చిండన్నా …. వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అన్నాడో మహకవి. అమ్మ అనే పిలుపులోని కమ్మదనం, వెన్నెలలోని చల్లదనం, పూలలోని సుగంధం, తేనే లోని మాధుర్యం ఇవన్ని కలిస్తే 'తెలుగు' భాష.
తేనెల తేటల మాటలతో
మన దేశ మాతనే కొలిచెదమా
భావం, భాగ్యం కూర్చుకుని
నవజీవన యానం చేయుదమా //తేనెల//
సాగరమేఖల చుట్టుకొని
సురగంగ చీరగా మలచుకొని
స్వేచ్ఛాగానం పాడుకొని
మన దేవికి ఇవ్వాలి హారతులు //తేనెల//
గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే //తేనెల//
ఎందరొ వీరుల త్యాగఫలం
మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరినీ తలచుకొని
మన మానసవీధిని నిలుపుకొని //తేనెల//