తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడింది, 10 సంవత్సరాలు రాజకీయ నిరుద్యోగిగా ఉన్న చంద్రబాబు కు ముఖ్యమంత్రి పదవి దక్కింది, ఆయన కొడుకు లోకేష్ కు మనీ కలెక్షన్ పని దొరికింది, లోకేష్ సన్నిహిత మిత్రుడు 'అభిష్ట' కు ముఖ్యమంత్రి వద్ద 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ' పోస్ట్ దక్కింది. మొత్తంగా వాళ్ళందరూ వెరీ హ్యాపీ.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 9 నెలలు దాటుతుంది. లక్ష ఉద్యోగాలు కాదు కాదు కదా! కనీసం వెయ్యి ఉద్యోగాలు కూడా భర్తీ చెయ్యలేదు. నిరుద్యోగులు, ఆశావాహుల సంఖ్యా పెరిగి పోతూనే ఉంది. మరి ముఖ్యమంత్రి గారి ఎన్నికల వాగ్దానాల మాటేమిటి?
ఇప్పటికే ఖజానాలో ఉద్యోగుల జీతాలు చెల్లించటానికి కూడా డబ్బులు లేక ఓవర్ డ్రాఫ్ట్ పై ఆధార పడవలసి వస్తుంది. ఆర్ధిక లోటుతో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి 'చంద్రబాబు నాయుడు' ముఖ్య మంత్రి ఇతేనే మంచి జరుగుతుందని, ఆయన ఇతేనే అధ్బుతాలు చేయగలడని, ఆయన గొప్ప పాలనా దక్షుడని ప్రచారంలో తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు నాయుడు పదే, పదే చెప్పిన మాటలు ప్రజలు కూడా నమ్మి ఓట్లు వేశారు, కానీ ఇప్పుడు వాస్తవంలో జరిగేది వేరుగా ఉంది.
బాబు గారు, నిజం చెప్పటం నేర్చుకోండి. ప్రజలకు ఎన్నికల వాగ్దానాలలో ఆశలు కల్పించి, యేరు దాటాక తెప్ప తగలేసే కార్యక్రమాలు చేపట్టవద్దు. మీరు చేయగలిగే విషయాలే ప్రజలకు చెప్పండి. ఆంధ్ర ప్రజలు ఎంతో సహనవంతులు, ఆశ పడటం, మోసపోవటం వీరికి అలవాటే!
ఆత్మ స్థుతి పరనింద ఇప్పటికైనా మానండి, సద్విమర్శలు సానుకూలంగా స్వీకరించండి.