జగన్ స్కెచ్ వేస్తే తిరుగుండదని వైకాపా వర్గాలు చెప్పుకుంటారు. గతంలో షర్మిల విషయంలో ఇలాగే జరిగింది, రొటీన్ గా ఉన్న జగన్ ప్రసంగాల కన్నా షర్మిల ప్రసంగాలకు వైకాపా శ్రేణుల నుండి, ప్రజల నుండి స్పందన బాగా వస్తుండటంతో ఆమెను పార్టీకి, ప్రసంగాలకు దూరం చేసి పార్టీ ఉనికే లేని తెలంగాణా ప్రాంతానికే జగన్ ఆమెను పరిమితం చేసిన విషయం అందరికి తెలిసిందే! ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, వైకాపా శ్రేణులు ఆమెను మర్చిపోయే పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం జగన్ కు ధీటుగా పార్టీ శ్రేణులను ఆకర్షిస్తున్న మరో నేత 'రోజా'. అసెంబ్లీలో జగన్ ప్రసంగాల కన్నా రోజా దూకుడు ప్రవర్తనే అందరిని ఆకర్షిస్తుండటంతో జగన్ కొంత ఇబ్బందిగా ఫీలయ్యాడట. పైగా పార్టీ శ్రేణులు కూడా జగన్ కన్నా రోజానే అసెంబ్లీలో ఇరగదీసింది అని వ్యాఖ్యానించుకుంటున్నారట.. ఈ పరిణామాలు మింగుడు పడని జగన్ ఎలాగైనా రోజాను 'డి ఫేం' చెయ్యాలని ప్లాన్ చేసి అసెంబ్లీ లో రెచ్చిపొమ్మని రోజాకు సలహా ఇచ్చాడట. పాపం జగన్ వ్యూహం తెలియని రోజా (అసలే కోతి.. ఆపై కల్లు తాగింది) తన బాస్ సూచించిన విధంగానే అసెంబ్లీలో రెచ్చిపోయి ప్రవర్తించి, విపరీత వ్యాఖ్యలు చేసి చివరకు అసెంబ్లీ నుండి సంవత్సర కాలం సస్పెండ్ అయ్యి పరువు పోగొట్టుకుంది, ప్రజల్లో చులకన అయ్యింది.
రోజా పై సస్పెన్షన్ వేటు వేయమని స్పీకర్ ను కోరమని జగన్ కొంతమంది తెదేపా సభ్యులకు లోపాయకారీగా సూచించాడట. ఏదేమైనా.. జగన్ వ్యూహం ఫలించింది. ఇప్పుడు అసెంబ్లీలో జగన్ కు 'రోజా' బెడద తప్పింది, వైకాపా తరుపున ఇప్పుడు జగన్ ఒక్కడే ఆకర్షణ కలిగిన నాయకుడు. మొత్తానికి తమ బాస్ తక్కువోడు కాదని పార్టీలో ఎవరైనా తనకంటే ఎదిగి పోతున్నారనుకుంటే తల్లైనా, చెల్లైనా, మరెవరైనా మొగ్గలోనే తుంచివేస్తాడని 'జగనా మజాకా!' అని వైకాపా శ్రేణులు గుస గుసలాడుకుంటున్నారు.