హిందీ లో స్టార్ ప్లస్, కలర్స్, జీ టివి, సబ్, లైఫ్ ఓకే మొదటి ఇదు స్థానాల్లో ఉండగా, సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఆరవ స్థానంలో నిలిచింది.
TAM తాజా రేటింగ్స్ లో తెలుగులో
జీ టివి తెలుగు 598 GRP (GROSS RATING POINTS) తో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది, రెండో స్థానంలో మా టివి 519 GRP తో, మూడవ స్థానంలో జెమినీ టివి 457 GRP తో, ఆఖరి స్థానంలో 452 GRP తో ఈ టివి. తమ తమ పాత స్థానాల్లో ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే జీ టీవీ రేటింగ్ పాయింట్స్ పెంచుకోగా. మా టివి 24 పాయింట్లు ఇతర ఛానళ్ళకు కోల్పోయింది.హిందీ లో స్టార్ ప్లస్, కలర్స్, జీ టివి, సబ్, లైఫ్ ఓకే మొదటి ఇదు స్థానాల్లో ఉండగా, సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఆరవ స్థానంలో నిలిచింది.
0 Comments
పేస్ బుక్ లైక్స్ విషయంలో 'సిసింద్రి అఖిల్' ఆదరగొడుతున్నాడు. హీరోగా నటించిన మొదటి చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే నేటి యువతరం హీరోలకు ఎవ్వరికీ లేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు పేస్ బుక్ లో అఖిల్ అక్కినేనిని అభిమానించిన వారి సంఖ్య 8,86,678. చిత్రమేమిటంటే ఎనిమిది సంవత్సరాలనుండి సిని రంగంలో ఉన్న అక్కినేని నాగచైతన్యకు పేస్ బుక్ అభిమానుల సంఖ్య కేవలం 1,63,513 మాత్రమే, 28 సంవత్సరాలుగా హీరోగా వెలుగుతున్న తండ్రి నాగార్జునకున్న పేస్ బుక్ అభిమానుల సంఖ్య 12,00,716. ఈ లెక్కన చూస్తే అఖిల్ అక్కినేని తన మొదటి సినిమా రిలీజ్ ముందే తన తండ్రి అభిమానుల సంఖ్యను దాటిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. కథానాయకుడిగా తన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే పేస్ బుక్ లో ఇంతమంది అభిమానులను సంపాదించుకోవటం నిజంగా పెద్ద రికార్డే.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హీరో నాని కి 31,36,406 మంది, హీరో మహేష్ బాబు 30,48,224, జూనియర్ యన్టిఆర్ 17,58,195 కంటే ఎక్కువ మంది పేస్ బుక్ అభిమానులున్నారు. మోహన్ బాబు సంతానంలో తమ్ముళ్ళ కంటే అక్కకే ఎక్కువ మంది పేస్ బుక్ అభిమానులున్నారు. మంచు లక్ష్మికి 11,20,969, మనోజ్ కు 8,39,848, విష్ణుకు కేవలం 1,07,633 అభిమానులు మాత్రమె ఉన్నారు. వారసత్వ నేపధ్యంలేని నేటి యువతరం చిన్న హీరోల్లో మూల్పూరి నాగ శౌర్య కు అత్యధికంగా 1,32,544 మంది పేస్ బుక్ అభిమానులున్నారు. రాజమౌళి బాహుబలి చిత్రం విడుదలకు ముందే సంచలనం కలిగిస్తుంది. ఏ మీడియా చూసినా ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు, ముచ్చట్లే! జూలై 10వ తేదిన విడులయ్యే ఈ చిత్రానికి రెండు పార్టులకు మొత్తం ఖర్చు 250 కోట్లు అని రాజమౌళి చెప్పాడు, కానీ 150 కోట్లకు మించదని సినీ వర్గాల భోగట్టా! ఒక వేళ 250 కోట్లే అనుకొంటే రాజమౌళి పారితోషికమే 150 కోట్లు అనుకోవాలి.
ఈ చిత్రం వలన లాభపడేది ముందుగా రాజమౌళి, ఆ తరువాత ఈ చిత్రాన్ని అన్ని ఏరియాలకు మంచి రేటుకు అమ్ముకున్న నిర్మాతలు, చివరగా హీరో ప్రభాస్. ఒక్కో పార్ట్ 75 కోట్లకు మించని ఈ చిత్రాన్ని ఒక్క తెలుగు భాషలోనే 75 కోట్లకు నాన్ రికవరబుల్ అడ్వాన్సు తో (శాటిలైట్ రైట్స్ కాకుండా) అమ్మారు. ఇతర భాషలకు, ఓవర్సీస్ హక్కులు, డబ్బింగ్ హక్కులు కనీసం మరో వంద కోట్లకు తక్కువ కాకుండా అమ్మేశారు, అంటే బాహుబలి మొదటి పార్ట్ సుమారుగా 175 కోట్ల వ్యాపారం జరిగింది. తెలుగులో అత్యధిక ధర చెల్లించి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న పంపిణీదారులు, దియేటర్ యజమానులు ఈ చిత్రానికి టికెట్ ధరను విపరీతంగా పెంచి వేశారు. ఒక్కో టికెట్ కనీస పక్షం రూ.200, గరిష్టం రూ.700 నిర్ణయించటమే కాకుండా ఆ టికెట్లను సైతం బ్లాకులో విక్రయిస్తూ ప్రేక్షకుల బలహీనతను సొమ్ము చేసుకొంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం మరి ప్రచార సాధనాల దృష్టికి వచ్చినా ఎందుకు స్పందించటంలెదో వారికే తెలియాలి. ఈ చిత్ర దర్శకుడు, నిర్మాతలు ఇంకొన్ని విషయాలు శలవిచ్చారు, ఈ చిత్రం అప్పు చేసైనా, ఎవడి జేబైనా కొట్టేసైనా, ముష్టి యెత్తుకునైనా, అత్యధిక రేటు పెట్టి కొనుక్కుని థియేటర్ లోనే చూసి వీరిని బ్రతికించాలట. పైరసి సిడి లు చూసినా, ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకుని చూసినా కేసు పెడతారట, ఏమి సంఘ సేవ, యెంత దేశభక్తి! ఈ సినిమా హీరో ఈ చిత్రం విడుదల కోసం తన వివాహం వాయిదా వేసుకొన్నాడట... ఈయనకు పెళ్లి లేటైనా, అసలు కాకపోయినా దేశానికి కాని, సమాజానికి కాని ఏమి నష్టం? ఈయన డబ్బుల కోసం నటిస్తున్నాడు తప్ప దేశం కోసం, ప్రజల కోసం కాదే! మద్యం, మత్తు లాగే కొందరికి ఈ సినిమాలు కూడా బలహీనత, అందుకే వీరి బలహీనతల పై గురి పెట్టి ఈ చిత్ర నిర్మాతలు విపరీతమైన పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులను ఆకర్షించి వలవేస్తున్నారు. మందు వ్యసనం ఉన్న డబ్బున్నోడు రేటేక్కువైనా బ్లాక్ డాగ్ కొనుక్కుని తాగుతాడు, పేదోడు చీప్ లిక్కర్ కొనుక్కుని తాగుతాడు. అక్కడ కనీసం ఆ ఛాయస్ ఐనా ఉంది కానీ ఇక్కడ కనీస ఛాయస్ కూడా లేకుండా చేశారు. లిక్కర్ కంపెని యజమానులకు అడ్డగోలు ధరలు నిర్ణయించే అధికారం లేదు, లిక్కర్ వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకొనే వీలు లేదు, కానీ సినిమా వాళ్లకు మాత్రం ఈ వెసులుబాటు ఉందా? ఎప్పుడైనా పండుగల సమయం లో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆర్టిసి కాని, రైల్వేలు కాని ప్రయాణీకుల సౌకర్యార్ధం ప్రత్యెక బస్సులు, రైళ్ళు ఏర్పాటు ఏర్పాటు చేసి చార్జీలు కొద్ది మొత్తం పెంచితేనే గొంతు చించుకునే మేధావులు, మీడియా ఇప్పుడు కొందరు వ్యక్తులు ప్రేక్షకుల బలహీనతలు ఆసరాగా తీసుకుని పబ్లిగ్గా ఇంత దారుణానికి దిగబడితే ప్రశ్నించరె? ఈ సినిమా వాళ్ళు కేవలం పక్కా వ్యాపారస్తులే.. వీళ్లేమి సంఘసేవ, ప్రజాసేవ చేయటం లెదు. సినిమా రంగంలో కేవలం కొంత మంది పెద్ద నిర్మాతలు, దర్శకులు, నటులు మాత్రమె లబ్ది పొందుతున్నారు. చిన్న నటులు, నిర్మాతలు, దర్శకులు కనీసం సినిమా రిలీజు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఫిలిం ఇండస్ట్రీ బాగుపడాలంటే పెద్ద సినిమాలు 10 కన్నా చిన్న సినిమాలు 100 రావాలి, అప్పుడే ఈ రంగంలో చిన్న, పెద్ద అందరూ బాగుంటారు. అయ్యా రాజమౌళి గారూ... మీ సినిమా బాహుబలి వలన ఈ రాష్ట్రానికి కాని, దేశానికి కానీ, ప్రజలకు కాని ఏమి ప్రయోజనం, ప్రజలందరూ తమ సొమ్ము త్యాగం చేసి మీరు నిర్ణయించిన ధరలకే, మీరు బ్లాకు లో అమ్మే ధరలకే ఈ సినిమా చూడాలంటున్నారు , మీ సామజిక సృహ, సంఘసేవ అమోఘం... మీరు బాట వేశారు... రేపు అదే బాటలో నడవటానికి సినిమా బలహీనత ఉన్న ప్రజలను దోచుకోటానికి మీ ఇండస్ట్రీ పెద్దలు సిద్ధంగా ఉన్నారు. |
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|