రోహిత్ కులం గురించి ప్రసార మాధ్యమాల్లో, బయట ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలు చేసే వారందరికీ నాదొక మనవి. రోహిత్ తండ్రి 'వడ్డెర' అనేది సత్యం, స్వయంగా రోహిత్ తల్లే ఆ విషయం ఒప్పుకున్నారు అంటే రోహిత్ 'BC' కేటగిరి రిజర్వేషన్ లోకి వస్తాడు, ఒకవేళ రోహిత్ దళిత - క్రిస్టియన్ అనుకున్న పక్షంలో అతనికి SC కేటగిరి వర్తించదు, అతను దళిత క్రిస్టియన్ 'BC-C' కేటగిరిలోకి వస్తాడు. ఒకవేళ దళిత - హిందూ అయిన పక్షంలో ఒక మతం ద్వారా సంక్రమించిన SC హోదాను అనుభవిస్తూ అదే మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయటం ఆత్మద్రోహం, అంతకన్నా నీచం మరొకటి ఉండదు... ఈ విధంగా వ్యాఖ్యానించటం మన జన్మనిచ్చిన తల్లి తండ్రులను దూషించటంతో సమానం. తన పుట్టుకను దాచిపెట్టినవాడు పురుగుతో సమానం. తప్పును తప్పుగా ఒప్పుకున్నా వాడే మనిషి కానీ తన తప్పును సమర్ధించుకుంటూ తప్పుడు వాదనలు చేసేవాడు వాడు మనిషే కాడు.
అగ్ర కులం వాడైనా,, నిమ్న కులం వాడైనా ఇతరులను కులం పేరు పెట్టి దూషించటం తప్పు. దేముడు మనందరినీ మనుషులుగానే పుట్టించాడు, అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది, సమాజం మనల్ని కులాలుగా విడకొట్టింది, రాజకీయనాయకులు కులాలని పెంచిపోషించి, కులాల కుంపట్లు రగిలించి తమ పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయ నాయకుల క్రీడలో మనం సమిధలుగా మారుతున్నాం. ఎవరి కులాన్ని, మతాన్ని వారు అభిమానించటం తప్పు కాదు కానీ ఇతర కులాలను, మతాలను గౌరవించటం కూడా నేర్చుకోండి.
దళితుడిదైనా మరొకరిదైనా ప్రాణం ప్రాణమే! తప్పు ఎవరు చేసినా తప్పే, క్రిమినల్స్ కు కులం, మతం అంటగట్టకండి. అన్ని కులాల్లో, మతాల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. వ్యక్తులను విమర్శిస్తే తప్పు కాదు కానీ దేవుళ్ళను, మతాలను, కులాలను దయచేసి విమర్శించకండి, అలా చేస్తే ఆయా వర్గాల ప్రజలందరి మనోభావాలు దెబ్బతింటాయి. జన్మ నిచ్చిన తల్లిని, దేశాన్ని, మతాన్ని, కులాన్ని విమర్శించే వెధవలకు పుట్టగతులుండవు.