తెలుగు లోగిళ్ళకు “తొలికాంతి” సంబరాల సంక్రాంతి
అంబరాన్ని అంటిన సంబరాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం, అందరూ బావుండాలి, అంతా మంచే జరగాలి అనే ఆశతో భవిష్యత్తుకు బాటలు పరిచేశాం. గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో విపత్కర పరిస్థితుల మధ్య క్షణ క్షణం భయంతో గడిపిన రైతన్న చల్లగా, చల్లని గాలుల మధ్య, ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. పరవళ్ళు తొక్కిన నదులు, సంద్రాలు, కాలువల సాక్షిగా, తన చమట జల్లుని చిందించి నేల తల్లిని పులకరింప చేసి పచ్చని పల్లెలో వెలుగు నింపుతూ పచ్చగా రంగు వేసినట్లుగా పండిన పంటను చూసి ఎద్దుకొమ్ముల మధ్య సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ సంక్రాంతి పండగ చేసుకుంటున్నాడు. అసలు సంక్రాంతి అంటే!చల్లని గాలుల నడుమ, పచ్చని పైరుల నడుమ, ప్రతీ ఊరు, ప్రతీ ఇల్లు ధాన్యపు రాశులతో, డూ డూ బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు వాళ్ళ విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళు, భం భం అనే జంగర దేవరలు, హంగామాతో హాస్యన్ని పండించే పగటి వేషగాళ్ళు, మా ఇంటికి రండీ అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు, గాలి పటాలతో సందడి చేసే పిల్లలు, ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులు పందెం రాయుళ్ళ పౌరుషానికి పదును పెడుతూ వేసే కోడి పందాలు, చిట్టి పొట్టి పాపల బుడి బుడి అడుగులు, కొత్తగా పెళ్ళైన జంటలు, ఇలా అందరి సమక్షంలో బొమ్మల కొలువులతో, భోగి మంటల చాటున చల్లని ఉదయాన్ని ఆస్వాదిస్తూ, పాత వస్తువులను, కష్టాలను, భోగి మంటలకు సమర్పిస్తూ, చిన్నారులకు భోగి పళ్ళు పోస్తూ ఇబ్బందులు, ప్రమాదాలు ఇలా ఏమి కలగకుండా అందరు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలి, ప్రతీ ఇల్లు ఒక హరివిల్లులా మారాలి. అదే అసలైన సంక్రాంతి, అందమైన, ఆనందమైన జీవితాలలో తొలి కాంతి. అసలు సంక్రాంతి అంటే పురాణాల సాక్షిగా సంక్రమణం, అంటే మార్పు చెందడం, సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశిస్తాడు, అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలదు, ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు అందుకే ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు రోజులుగా చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగా అని కూడా పిలుస్తారు, మూడు రోజుల పండగలో మొదటిగా భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. ఈ అందమైన పండుగలో మొదటి రోజును భోగి అని పిలుస్తారు. ఈరోజు అందరూ భోగి మంటలతో ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు అందరూ ఉదయాన్నే లేచి ఎముకలు కొరికే చలిని తరిమేయడానికి పాతవస్తువులు అన్నీ సమకూర్చి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని ఆ చలిలో వెచ్చదనాన్ని ఆశ్వాదిస్తారు. ఇక సాయంత్రం వేళ, బొమ్మల కొలువులతో, చాలా ఇళ్ళలో చిన్నపిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా, ఉల్లాసంగా అడుతూపాడుతూ గడుపుతారు. ఇక భోగి పళ్ళ పేరంటాలైతే అందరూ సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. అలా పండుగలో మొదటి రోజు, తొలి ఘట్టం పూర్తి అవుతుంది. తెలుగు సాంప్రదాయానికి ప్రతీక, సుఖ సంతోషాల గీతిక సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి రెండవ రోజు, అసలైన పండుగ రోజు సంక్రాంతి. ఈరోజు తెల్లవారగానే పాలు పొంగించి, కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన పిండి వంటలు తింటూ, సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు, మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం ఏమిటంటే ఈ రోజున “హరిలో రంగ హరీ” అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. “ఆకలికి అన్నం పెట్టే రైతన్న కళకళలాడుతూ ప్రపంచమంతా వెలుగు నింపాలి” సంక్రాంతి పండుగ మూడవ రోజు, చివరిదైన కనుమ రోజు. ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు, ఈరోజు ఆడ పిల్లలందరు, గొబ్బెమ్మలు పెడతారు, గొబ్బెమ్మ అంటే గోపి+బొమ్మ, అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం, వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసాహారులు కాని వారు, గారెల తో (మినుము లో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకాహార మాంసం గా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం. “గొబ్బెమ్మలు” అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం” అందరి జీవితాల్లో ఆనందాన్ని, భోగ భాగ్యాలని, నూతన కాంతిని ఈ సంక్రాంతి నింపాలని, అందరికీ అన్నం పెట్టే రైతన్న చల్లగా, సుఖ సంతోషాలతో కళకళలాడాలని, కోరుకుంటూ “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు”. A hots pot of Andhra Pradesh that is becoming the first demand especially for hill station lovers. A small town of AP with full greenery everywhere is definitely going to attract voyagers. Surrounding is covered with hills and dense forest so you are going to enjoy the nature as well as best hospitality of India at this special destination. This Indian tourist place is all time favorite spot for nature lovers.
Lambasingi also called as Lammasingi is a small village in the Chintaplli Mandal of Vishakapatnam district of Andhra Pradesh, India, perched at an altitude of 1025 meters above sea level. Another name for this Lambasingi village is Korra Bayalu. Korra means ´stick´, Bayalu means ‘outside’, in the local language this means “if some one stays outside the house in the open they will freeze like a stick”. Lambasingi is the only place in Southern India, where you can experience snowfall sometimes in winter. Even in seasons other than winter, sunlight falls only after 10 AM in the morning. The most important part of this town is the temperature goes below 0 °C in winter. December and January are two most difficult months in this region due to chilled air flow. However, snow fall rarely occurs in this place, but the temperature is always low than 10 degree throughout the year. The town is having different climate than other cities of the state. Sun rises at regular time but the sunlight reach the town after 10 am every day except winter season. In winter the sun gets little bright after 12 noon. However, the light become shorter after 3 pm every day because the place get blank with thick fog after 3 pm. There were instances where the temperature had touched below one degree. The last time sub-zero temperature was recorded at Lammasingi during December 2008 and January 2011 The nearby forest hill station Chintapalli is one more tourist attraction. Tajangi valley is best attraction in Chintapalli. The major source of income of Lambasingi is coffee and pepper plantations. However, tourism is also increasing here so future is bright of this town. This Indian tourist place is popular for producing best coffee and pepper ever. All these plantations are being cultivated since the British Regime in India. Coffee grown here is exported to the USA and UK Nations Talking about attraction in this place the greenery and valleys are important areas that you can cover. Some spots are famous for trekking and adventure events like camping. However, walking the area will give you more enjoyment as you will be able to watch the natural beauty closer. The tourist department of Andhra Pradesh is having travel packages for Lambasingi. You can contact the office through online for booking of your favorite accommodation in this town. APSRTC is providing service related to tourism in this area like you can enjoy the forest safari and can watch the real jungle closer than ever. Lambasingi is properly connected through road and direct buses for the town are available from Visakhapatnam, Narsipatnam, Chintapalle and some more cities. It is 101 KMs from Visakhapatnam, 19 KMs from Chintapalle and 32 KMs from Narsipatnam via NH5.
ఏ పట్టణం చూసినా ఏముంది గర్వకారణం? ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములు, వాహనాల రొద, శబ్ద, ధ్వని కాలుష్యం, దుమ్ము, ధూళి, కార్బన్ మోనాక్సైడ్ కంపు తప్ప!
కోకిలల కుహు కుహు రాగాలు, కోడిపుంజుల 'కొక్కొరోకో' సంగీతాలు, పిచ్చుకమ్మల కిచ కిచలు నగరాల్లో మీకెప్పుడైనా వినిపించాయా? చెంగున గెంతే కోడె దూడలు, డీ కొడదాం రమ్మనే గొర్రె పొట్టేళ్ళు, అందమైన గోమాతలు, యవ్వనం ఉట్టిపడే గిత్తలు పట్టణాల్లో మీకెప్పుడైనా కనిపించాయా? ఊర చెరువులో విరబూసిన కలువ, తామరలు, పిల్లకాలువల్లో కాళ్ళకు తగులుతూ గిలిగింతలు పెట్టె మట్టగుడిసెలు, కాలువ గట్లపై విరగ బూసిన పొగడ పూల చెట్లు నగరాల్లో మీరెప్పుడైన చూశారా? పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ డాగ్స్, తట్టుకోలేనంత కొవ్వు, భరించలేనంత అనారోగ్యం. ఘాటైన పాయిజన్ సెంట్లు, అలేర్జిలు, తుమ్ములు, హాస్పటల్స్, డాక్టర్లు ఇదేనా నగర జీవితం? తొలకరి చినుకుల మైమరపించే మట్టి వాసన, మత్తెకించే వేప పూల, విరిసిన బంతిపుల కమ్మటి సువాసన, తంపటివేసిన తేగల, కుంపట్లో కాల్చిన చిలగడ దుంపల, ఉడకబెట్టిన పచ్చి వేరుశనగ కాయల, నిప్పులపైన దోరగా కాల్చిన లేత మొక్కజొన్న కండెల వాసనలు, రుచి మీరు అప్పుడే మర్చి పోయారా? మల్లెపూల వాసన ఆర్చిడ్ పూలకు ఉండదు. ఆర్చిడ్ పూల అందం మల్లెపూలకు ఉండదు, మల్లె మొక్కలు పెరట్లో పెట్టుకుంటాం కానీ ఆర్చిడ్ మొక్కలు కుండిల్లోనే పెంచుతాము. పల్లెలు భార్యలు, పట్టణాలు ప్రియురాళ్ళు ... పల్లెల్లో ఉంటూ ఎప్పుడైనా ఒకసారి పట్నం వైపు తొంగి చూడండి కాని పట్టణాలే ప్రపంచం అనుకోకండి.... ప్రకృతి సౌందర్యం అంతా పల్లెల్లోనే ఉంది. పచ్చటి పొలాలు, కొబ్బరి, తాటి, ఈత చెట్లు, పిల్ల కాలువలు, చెరువులు, పశువులు... ఇలా ఒక అందమైన చిత్రీకరణ ఒక్క పల్లెటూర్లలోనే ఆవిష్కృతమౌతుంది. శీతాకాలం (శరదృతువు) లో పల్లెటూళ్ళ అందం వర్ణించ నలవి కాదు... కోతకు వచ్చిన వరి పొలాలు, కోసిన వరి కుప్పలు, పొలాల్లో వడ్ల పురులు, వెరసి రైతుల కళ్ళల్లో బిడ్డ పుట్టినంత ఆనందం (ఆరుగాలం పంట అక్కరకు వచ్చినందుకు).... ఒక్కసారి 'మంచు దుప్పటి' కప్పుకున్న ఆ పచ్చటి పొలాలను కాలువ గట్ల పైనుండి నడచి వెళ్లి పలకరించండి... ఎడ్ల బండిపై మట్టి రోడ్డు మీద మీ తండ్రి, తాత గారి ఊరుని ఒక సారి చుట్టి రండి... నిజం చెప్పండి, మనం బ్రతికేది ఒక బ్రతుకేనా అనిపించటం లేదు? ఉదయం లేచిన దగ్గర నుండి ఉరుకులు పరుగుల జీవితం, ట్రాఫిక్ జాములు, వాతావరణ, శబ్ద కాలుష్యం, కొంచెం సేపు ఆగి విశ్రాంతి తీసుకుంటే, ఎక్కడ వెనకబడి పోతామో అన్న బ్రతుకు పోరాటం... పక్క వాడిని దాటి ముందుకు వెళ్ళాలన్న ఆరాటం, డబ్బులు కూడబెట్టలన్న ఆశ, ఇవన్నీ మనకు AC గదుల్లో కూడా ఉపిరాడకుండా చేస్తున్నాయి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ లేకుండా నిముషం గడవదు, ముద్ద దిగదు. ఇక పిల్లలైతే మరీను! మేలుకున్న దగ్గర నుండి నిద్ర పోయేవరకు చదువు.. చదువు.... ఖాళి దొరికినప్పుడు పేస్ బుక్, లేకపోతె Whatsap . రోజు తినే బియ్యం, కూరగాయలు, పప్పు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు. ఎడ్లు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు టీవీ లో తప్ప ఎన్నడు నిజ జీవితంలో చూసి యెరుగరు... ఇది కాదు జీవితం. రండి... పల్లె పిలుస్తుంది, ఒక్కసారి మన పల్లె పిలుపుకు ప్రతిస్పందించండి. చనిక్కాయలు, చెరుకు గడలు, మొక్కజొన్న కండెలు, మీగడ పెరుగు మీకోసం ఎదురు చూస్తున్నాయ్. |
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|