రామోజీరావు అపర చాణుక్యుడు, జగన్ మాటలకో, పొగడ్తలకో పడిపోయే రకం కాదు... కీలెరిగి వాత పెట్టటంలో ఆయన దిట్ట. ఇక జగన్ హరీష్ రావుతో భేటి అయినా, కేటిఆర్ తో భేటి అయినా వీళ్లేమీ చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో కుట్రపన్ని చంద్రబాబు నాయుడును ఇరికించి రేపో మాపో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటూ విపరీతమైన ప్రచారం చేసి, ఫోన్ టాపింగ్ వ్యహారంలో తెలంగాణా ప్రభుత్వం చిక్కుకుని అసలుకే మోసం రావటంతో చివరకు మూసుకుని మూల కూర్చున్న ఈ ముండమోపి వెధవలు కలిస్తే రాలేది బూడిదే .....
ఇక ద్రుతరాష్ట్ర గవర్నర్ మొదటి నుండి చంద్రబాబు నాయుడుకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యహరిస్తున్నాడు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగినపుడు కాని మరే ఇతర సందర్భంలో కాని అతని ప్రవర్తన తెలంగాణాకు అనుకూలంగానే ఉంది. చంద్రబాబు నాయుడు, ఆంధ్ర మంత్రుల ఫోన్ టాపింగ్ జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి అబద్ధపు నివేదిక ఇచ్చిన ఘనుడు. చివరకు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని తన గవర్నర్ పదవిని మరికొంత కాలం కాపాడుకోగలిగాడు. "రోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు" జగన్... గవర్నర్ నరసింహన్ కలిస్తే చెయ్యగలిగింది చెక్క భజనే!
పవన్ కళ్యాణ్ ను వైసిపి వాళ్ళు ముద్దుగా "పావలా కళ్యాణ్" అని పిలుచుకుంటారు... ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కు మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుతో మంచి సంభందాలే ఉన్నాయి. జగన్.. పవన్ భేటి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ భేటి అయినా పవన్ కళ్యాణ్ లాంటి తిక్కోడు జగన్ బాటలోకి వెళ్ళే పరిస్థితి ఎంతమాత్రం లేదు.
రాజధాని నిర్మాణం ఊపందుకోవటం, ప్రపంచ బ్యాంకు రేటింగ్, దేశ, విదేశ పారిశ్రామిక వర్గాల్లో ఆంధ్ర ప్రదేశ్ కు, చంద్రబాబుకు పెరుగుతున్న పరపతి, ఆంధ్ర కు వరుసబెట్టి వస్తున్న పరిశ్రమలు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్న అనుకూలతలతో దిక్కుతోచని జగన్ ఈ విధంగా ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం చందంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకులతో పాటు కొందరు చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషులను కలవటం వెనుక ఏదో జరుగుతుంది... ఇంకేదో జరగబోతుంది అనే చౌకబారు ప్రచారం కోసం తప్ప మరేమీ కాదని తెలుగుదేశం పార్టీ వర్గాలు.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.