ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు.
అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడొకడు.
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.
ఆశకు అంతు లేదు.
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
అదిగో పులి అంటే , ఇదిగో తోక అన్నట్లు.
అదృష్టం అందలమెక్కిస్తానంటే,బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిన్దంట.
అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
అన్నీ వున్నాయి కానీ ఐదో తనమే తక్కువ.
అన్నీ సాగితే రోగం అంత భోగం లేదు.
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.
అరచేతిలో వైకుంటం
అమ్మ కడుపు చూస్తుంది, ఆలి (భార్య) జేబు చూస్తుంది.
అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలు
అప్పు చేసి పప్పు కూడు
అగ్ని కి వాయువు తోడైనట్లు
అడకత్తెరలో పోక చెక్క వలె.
అడవి కాచిన వెన్నెల
అబద్దమాడినా అతికినట్లు ఉండాలి.
అవ్వా కావాలి... బువ్వా కావాలి.
అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శని ఉంది.
అంత్య నిష్టూరం కన్నా ఆదినిష్టూరం మేలు.
అందరు పల్లకి ఎక్కితే మోసే వారెవ్వరు?
అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల.
అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు.
మింగ మెతుకు లేదు కాని, మీసాలకు సంపెంగ నూనె.
అందని ద్రాక్ష పళ్ళు పుల్లన
ఇల్లు అలకగానే పండుగ కాదు .
ఇల్లు ఇరకటం పెళ్ళాం మర్కటం.
నిండా మునిగాక చలి ఏంటి.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
కుక్క కాటుకి చెప్పు దెబ్బ
తాను దూర సందు లేదు కానీ మెడకో డోలు
కాపురం చెయ్యను కానీ కయ్యాలు పెదతానందట
గుర్రం గుడ్డిదైన దాణా పెట్టడం తప్పదు
ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు
పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నాడట
ఏరు దాటి, తెప్ప తగలపెటడం
దిగితే గాని లోతు తెలియదు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది
తీగ లాగితే డొంక కదిలింది
రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
మెత్తని వానిని చుస్తే మొత్తబుద్ధి అవుతుంది.
దున్నపోతు ఈనిందంటే – దూడను కట్టేయమన్నాడట